వైభవంగా మల్లన్న బోనాల జాతర

వైభవంగా మల్లన్న బోనాల జాతర

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య వేలాది బోనాలతో సామూహిక మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద బోనాల జాతరగా పేరు గాంచిన ఈ మల్లన్న జాతరకు  మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోరికలు నెరవేరిన భక్తులు బంగారాన్ని (బెల్లం) పంచిపెట్టడం, గొర్లు, మేకలను దేవునికి సమర్పించడం ఈ జాతరలో ఆనవాయితీ. 

దేవునికి సమర్పించిన గొర్లు, మేకలను ఆలయ కమిటీ టెండర్ వేస్తుంది. వాటి ద్వారా వచ్చిన డబ్బులను ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు. ఈ జాతరలో పోతురాజుల వీరంగం, రంగం (గావు పట్టడం) మరో ప్రత్యేకత. వేములవాడ రాజన్న దేవాలయం తరువాత అంత మంది భక్తులు సందర్శించుకునే క్షేత్రంగా పెద్దాపుర్ మల్లన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది.