భారీ వర్షానికి తెగిపోయిన రోడ్డు

భారీ వర్షానికి తెగిపోయిన రోడ్డు

గత రాత్రి కురిసిన వర్షానికి జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మోడల్ స్కూల్ రోడ్డు మరోసారి తెగిపోయింది. దీంతో ఆ మార్గం నుండి వెళ్లాల్సిన విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి ఈ మార్గం  స్కూల్ కు వెళ్లాలంటే  విద్యార్థులకు భయంతో కూడిన పరిస్థితి ఉందని విద్యార్థుల తల్లిదంండ్రలు అంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ తక్షణమే చర్యలు చేపట్టాలని బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నా్మన్నారు.  

రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌ను జారీ చేసింది. 

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌‌‌‌లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని‌‌‌‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్​గా ఉండాలని సీఎస్ ​శాంతికుమారి ఆదేశించారు.