V6 News

ఖబడ్ధార్ రేవంత్.. నీకు పుట్టగతులుండవ్ : మల్లారెడ్డి

ఖబడ్ధార్ రేవంత్.. నీకు పుట్టగతులుండవ్ : మల్లారెడ్డి

రేవంత్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల జోలికొస్తే పుట్టగతులుండవంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు  మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్  అధ్వర్యంలో  రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ నిరసనలో మల్లారెడ్డితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
 

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అని.. అతనో దగాకోరని ధ్వజమెత్తారు మల్లారెడ్డి.  డబ్బుల కలెక్షన్ల కోసమే రేవంత్  అమెరికా వెళ్లిండని ఆరోపించారు. కాంగ్రెస్ దివాలా తీసిందని.. రేవంత్ దివాలా తీసిన పార్టీకి పీసీసీ చీఫ్ అని మండిపడ్డారు. పీసీసీ చీఫ్  పదవిని ఆయన సీఎం పదవిలా ఫీలవుతుండని విమర్శించారు.   రేవంత్ రెడ్డిని నమ్మొద్దని.. కాంగ్రెస్ రైతులను మోసం చేస్తదన్నారు. కేసీఆర్ రైతుల మేలు కోరేవారని..బీఆర్ఎస్ ది రైతు సర్కార్ అని అన్నారు.