ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల ఆరోగ్య బీమా.. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌‌ మేనిఫెస్టో

ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల ఆరోగ్య బీమా.. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌‌ మేనిఫెస్టో
  • మహిళల ఖాతాల్లో నెలనెలా నగదు, స్వయం ఉపాధికి 50 వేల ఆర్థిక సాయం
  • అస్సాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌ మేనిఫెస్టో విడుదల
  • ఐదు గ్యారంటీలను ప్రకటించిన పార్టీ చీఫ్‌‌‌‌ ఖర్గే
  • తమిళనాడులో విద్యార్థులకు 35 లక్షల ల్యాప్​టాప్లు
  • మహిళలకు ఇస్తున్న సాయం 2 వేలకు పెంపు
  • అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన డీఎంకే చీఫ్​ స్టాలిన్​

లఖింపూర్‌‌‌‌: అస్సాంలో తాము అధికారంలోకి వస్తే ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షలవరకు క్యాష్‌‌లెస్‌‌ ఆరోగ్య బీమా కల్పిస్తామని కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 

అలాగే, రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రతినెలా నగదు సాయం అందజేస్తామని తెలిపారు. ఆదివారం అస్సాంలోని లఖింపూర్‌‌‌‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన.. పార్టీ మేనిఫెస్టోను రిలీజ్‌‌ చేశారు. మహిళలకు ప్రతి నెలా నగదు సాయం, స్వయం ఉపాధికోసం పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా, వృద్ధులకు నెలనెలా పెన్షన్‌‌తోపాటు.. అస్సాం మూలవాసులకు భూమి హక్కులు వంటి ఐదు గ్యారంటీలను ప్రకటించారు.

వృద్ధులకు ప్రతినెలా పెన్షన్‌‌.. 
బీజేపీ మాదిరిగా పార్టీ సభ్యత్వం ఉంటేనే పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్‌‌ కండిషన్లు పెట్టబోదని ఖర్గే స్పష్టం చేశారు. మహిళలందరికీ అన్‌‌కండిషనల్‌‌గా నెలవారీ నగదు సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే మహిళలకు పెట్టుబడి సాయంతోపాటు.. వృద్ధులకు ప్రతినెలా 1250 సాయం అందజేస్తామని చెప్పారు. అస్సాం మూలవాసులైన 10 లక్షల మంది భూమి పుత్రులకు శాశ్వత భూమి పట్టాలు ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. 

ప్రస్తుత ప్రభుత్వాలు ఏటా పట్టాలు ఇస్తున్నాయని, కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక పర్మనెంట్‌‌గా పట్టాలు ఇచ్చి ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. కర్నాటకలో ఇదే రీతిన కర్నాటకలో 7 లక్షల మందికి పట్టాలు పంచామని గుర్తుచేశారు. ఢిల్లీలోని తమ లీడర్ల ఖజానాలు నింపేందుకే రాష్ట్రంలో బీజేపీ సర్కారు పనిచేస్తోందని ఆరోపించారు.

బీజేపీ దుష్టపాలన, అవినీతి విధానాల నుంచి అస్సాంకు విముక్తి కల్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సింగర్‌‌‌‌ జుబీన్‌‌ గార్గ్‌‌ హత్య కేసులో న్యాయం చేస్తామని, హంతకులను, కుట్రదారులను బయటకు ఈడుస్తామని ఖర్గే ప్రకటించారు. యువత, రైతులు, చిన్న వ్యాపారవేత్తలు, తేయాకు తోటల కార్మికులు, మహిళలతో సహా సమాజంలోని ప్రతి వర్గంవారి అవసరాలను పార్టీ హామీలు తీరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

అస్సాం కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ గౌరవ్‌‌ గొగోయ్‌‌ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం విభజన విధానాలు పాటిస్తోందని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టేవాళ్లకు ఐదేండ్ల జైలు శిక్ష విధించే చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాగా, అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏప్రిల్‌‌ 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.