తప్పు చేస్తే ముందే అరెస్ట్ చేయాల్సింది

తప్పు చేస్తే ముందే అరెస్ట్ చేయాల్సింది

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ అరెస్ట్ పై రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. చన్నీపై రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకే భూపిందర్ ను అరెస్ట్ చేశారన్నారు. నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే.. నాలుగైదు నెలల ముందే అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చన్నీని వేధించేందుకే భూపిందర్ ను అరెస్ట్ చేశారని ఖర్గే పేర్కొన్నారు. 

కాగా, ఎన్నికల వేళ పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి మరో షాక్ తగిలింది. చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ మైనింగ్ కేసులో భూపిందర్ ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భూపిందర్ ను ప్రశ్నించిన అధికారులు.. భూపిందర్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని సాయంత్రం ప్రకటించారు. ఇవాళ ఆయనను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తల కోసం:

పాక్ ఫాస్ట్ బౌలర్పై ఐసీసీ సస్పెన్షన్

పట్టింపుల్ని పక్కనపెట్టి కత్తెర పట్టింది

గల్వాన్ మరణాలను దాచిపెడుతున్న చైనా