నెల రోజుల వరకూ ప్రజాపాలన కౌంటర్లు : భట్టి విక్రమార్క

నెల రోజుల వరకూ ప్రజాపాలన కౌంటర్లు : భట్టి విక్రమార్క
  • నెల రోజుల వరకూ ప్రజాపాలన కౌంటర్లు
  • ఆ తర్వాత కూడా అప్లికేషన్లు స్వీకరిస్తం
  • 6 గ్యారెంటీలకు దరఖాస్తులు ఇవ్వండి
  • ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతం
  • ఇది దొరలపాలన కాదు ప్రజాప్రభుత్వం
  • ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్: ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నెల రోజుల వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు  కౌంటర్లు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ అబ్ధుల్లాపూర్ మెట్ లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల  కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

also read : ప్రజాపాలన ఎఫెక్ట్: అప్లికేషన్ ప్రింటవుట్​ @ 40.. లబోదిబో మంటున్న కామన్ పీపుల్

ఇది ప్రజల ప్రభుత్వమని, ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చి తీరుతామని చెప్పారు.  తొమ్మిదేండ్ల నుంచి పెన్షన్ రాలేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. తాను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా చాలా మంది ప్రజలు ఇదే ఆవేదనను వ్యక్తం చేశారని భట్టి అన్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల వరకు కౌంటర్ల ఉంటాయని, ఆ తర్వాత కూడా దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.  ఈ పథకాల కోసం అన్ని పార్టీల కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. హామీలు అమలు కాకుంటే బాగుండనీ బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని, కానీ తాము కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు.