
తెలంగాణ డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించారు. విక్రమార్క హైదరాబాదులోని కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో చీఫ్ విప్ గా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2019 జనవరి 18న సీఎల్పీ నేతగా పనిచేశారు.