Congress war room case : సైబర్ క్రైం విచారణకు హాజరైన మల్లు రవి

Congress war room case : సైబర్ క్రైం విచారణకు హాజరైన మల్లు రవి

కాంగ్రెస్ వార్ రూం కేసులో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైబర్ క్రైం విచారణకు హాజరయ్యారు. సీఆర్పీసీ 41ఏ నోటీసుల్లో సూచించిన ప్రకారం ఉదయం 11.30గంటలకు సీసీఎస్ కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు.పోలీసులు ఏ అంశంపై ప్రశ్నిస్తారన్న సమాచారం తనకు లేదన్న ఆయన.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు. కాంగ్రెస్ వార్ రూం నుంచి సైబర్ క్రైం పోలీసులు తమ పార్టీకి చెందిన విలువైన సమాచారాన్ని ఎత్తుకెళ్లారని మల్లు రవి ఆరోపించారు. విచారణ అనంతరం ఆ సమాచారాన్నంతా తిరిగి ఇవ్వాలని కోరుతానని అన్నారు. వార్ రూం కేసులో సైబర్ క్రైం టీం కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును రెండు గంటల పాటు విచారించిందని, తనను ఎన్ని గంటల పాటు ప్రశ్నిస్తారో తెలియదని చెప్పారు.