
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో 27 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లకు మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన ఫస్టియర్ పరీక్షల్లో 1,89,656 మంది రాయాల్సి ఉండగా, 1,78,372 మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు.
11,284 మంది హాజరుకాలేదు. కాగా, ఫస్టియర్‌లో18 మందిపై మాల్ ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో 12, కరీంనగర్‌లో 3, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు బుక్ చేశారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షలో 68,871 మందికి గాను 64,682 మంది అటెండ్ అయ్యారు. ఈ పరీక్షల్లో తొమ్మిది మాల్ ప్రాక్టీస్ కేసులు రికార్డు కాగా, కామారెడ్డిలో నాలుగు, మహబూబ్ నగర్‌లో మూడు, హైదరాబాద్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.