లిప్​లాక్తో ఎలాంటి ఇబ్బంది లేదు: మాళవిక నాయర్

లిప్​లాక్తో ఎలాంటి ఇబ్బంది లేదు: మాళవిక నాయర్

మలయాళ నటి మాళవిక నాయర్ (Malvika Nair), నాగశౌర్య కలిసి నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం రేపు రిలీజ్​ కానుంది. ఆమె తొలిసారి ఓ కమర్షియల్​ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నందమూరి కల్యాణ్​రామ్(Kalyan Ram) ​హీరోగా యాక్ట్ ​చేస్తున్న డెవిల్​ మూవీ (Devil Movie) లో హీరోయిన్‌‌గా నటిస్తోంది.  తనను కలిసిన ఓ మీడియాతో స్వయంగా ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించింది. డెవిల్​ సినిమాను డైరెక్టర్​నవీన్​ మేడారం తెరకెక్కించనున్నారు. ఇక ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో కథ డిమాండ్​ ఆధారంగా లిప్​లాక్​ సీన్ ​చేశానని, ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదని మాళవిక నాయర్ పేర్కొంది.