ఆస్తుల్లో దీదీ తక్కువ..కేసుల్లో సువేందు ఎక్కువ!

ఆస్తుల్లో దీదీ తక్కువ..కేసుల్లో సువేందు ఎక్కువ!

కోల్‌‌‌‌కతా: వెస్ట్ బెంగాల్ లోని భవానీపూర్  నుంచి ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన సీఎం మమతా బెనర్జీ, ఆమెపై పోటీ చేస్తున్న ప్రతిపక్ష నేత సువేందు అధికారి తమ ఆస్తులను అఫిడవిట్‌‌‌‌లో ప్రకటించారు. మమత మొత్తం చరాస్తులు రూ.15.37 లక్షలు కాగా  2021లో ఇది రూ.16.7 లక్షలుగా ఉంది. ఆమెకు సొంత ఇల్లు, కారు, భూములు, షేర్లు, బాండ్లు, బీమా పాలసీలు లేవు. చేతిలో రూ. 75,700 నగదు, రూ. 1.45 లక్షల  నగలు ఉన్నాయి.  

ఇక బీజేపీ నేత సువేందుకు రూ. 61.30 లక్షల ఇల్లు, ఫ్లాట్, 2.46 ఎకరాల భూమి ఉన్నాయి. చరాస్తులు రూ. 24.57 లక్షలు, 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన ఆదాయం రూ. 17.38 లక్షలు. ఇది 2021 ఎన్నికల నాటి కంటే దాదాపు రెట్టింపు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌‌‌‌లో తలపడిన వీరిద్దరూ ఈసారి భవానీపూర్ వేదికగా రెండోసారి పోటీ పడుతున్నారు. సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్, భవానీపూర్ రెండు చోట్ల బరిలో నిలిచారు.