విద్యార్థినిని 10 సెకన్లే తాకిండు కాబట్టి నేరం కాదు: రోమ్ కోర్టు

విద్యార్థినిని 10 సెకన్లే తాకిండు కాబట్టి నేరం కాదు: రోమ్ కోర్టు

ఇటలీలో రోమ్ కోర్టు ఇచ్చిన తీర్పు దుమారం రేపుతోంది.   విద్యార్థినిని ఓ వ్యక్తి 10 సెకన్ల కంటే తక్కువ సమయమే  తాకినందున  నేరం కాదని కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా  మారింది. 

2022 ఏప్రిల్ లో ఓ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి స్కూల్ మెట్లు ఎక్కుతుండగా  సెక్యూరిటీ గార్డ్(66) తన  పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సెక్యూరిటీ గార్డ్ తన ప్యాంటు పైకి లాగి ,తనను వెనుక నుంచి తాకిండని.... తన  లో దుస్తులను కిందకు  లాగాడని కోర్టుకు తెలిపింది.  తర్వాత తాను భయపడటంతో జోక్ చేశానంటూ చెప్పి  వెళ్లిపోయాడని  ఫిర్యాదులో పేర్కొంది.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2023 జూలై 6న  కోర్టులో విచారణ సందర్భంగా.. నిందితుడు ఆ విద్యార్థినిని తాకినట్లు అంగీకరించాడు. అయితే తాను తమాషాగా చేశానని కోర్టుకు చెప్పాడు.  ఇద్దరి వాదనలు విన్న రోమ్ కోర్టు..  నిందితుడు  కామవాంచతో తాకలేదని.. కేవలం సరదాగా ఆ పనిచేసినట్లు చెప్పిన అతడి వాదనను అంగీకరించింది.  ఆ విద్యార్థినిని అతడు కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకిండు.. కాబట్టి  నేరం కాదని అతడిని నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

  కోర్టు  తీర్పుపై విద్యార్థుల నుంచి , మహిళల నుంచి  పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.