
జాబ్స్ కోసం వెతికే కంటే జాబ్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది.. ఇది ఆదర్శమైన విషయమే.. కానీ ఏ అర్హతా లేని.. కంపెనీకి సంబంధం లేని వ్యక్తి జాబ్ ఆఫర్స్ ఇస్తే ఏంటి పరిస్థితి. హైదరాబాద్ లో నిరుద్యోగులకు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఉప్పల్ ఎరీనా టవర్స్ లో ఉన్న ఓ కంపెనీ తరఫున ఆఫర్ లెటర్స్ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్న వ్యక్తి అరెస్టు చేశారు పోలీసులు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎంఎస్ఎల్ అరీనా టవర్ సాఫ్ట్ వేర్ భవనంలో లెన్స్‌సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు తో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మర్రిపాడు, శాంతబొమ్మడి గ్రామానికి చెందిన గిన్ని గోపి (30) అనే వ్యక్తి లెన్స్‌సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో పేరుతో పలువురికి జాబ్ ఆఫర్ లెటర్ లు ఇచ్చాడు. దీంతో ఆఫర్ లెటర్స్ పట్టుకుని చాలా మంది గత కొన్ని నెలలుగా లెన్స్‌సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్యూ కట్టారు.
ఎలాంటి రిక్రూట్ మెంట్ లేకుండా కంపెనీకి ఆఫర్ లెటర్స్ తో నిరుద్యోగులు వస్తుండటంపై కంపెనీ కంపెనీ యాజమాన్యం పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గిన్నీ గోపీ అనే వ్యక్తి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నట్లు గుర్తించిన కంపెనీ.. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
గిన్నీ గోపి కంపెనీ లోగో మరియు సంతకాన్ని నకిలీ చేయడం ద్వారా కంపెనీ ప్రతిష్టను దెబ్బతిస్తూనడాని సదరు కంపెనీ యాజమాన్యం పిర్యాదు చేసారు........
కంపెనీ పిర్యాదుతో ఉప్పల్ పోలీసులు దర్యాప్తు నిర్వహించి చాలా మందికి పేక్ జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి.. వారి నుండి వేల రూపాయలు వసూలు చేశాడని నిర్ధారించారు. దీంతో గిన్నీ గోపి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
గిన్నీ గోపి పై ఇలాంటి తరహా జాబ్ మోసాల కేసులు ఇప్పటికే ఉన్నాయి. ఇలాగే మోసం చేసి జైలు కు కూడా వెళ్లి వచ్చాడని , గొన్ని గోపి పై పలు రాష్ట్రాల పోలీసు స్టేషన్ లలో కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.