
హైదరాబాద్ : అశ్లీల ఫొటోలున్నాయని బెదిరించి ఓ మహిళా ఫ్యాకల్టీ దగ్గర రూ.3లక్షలు డిమాండ్ చేశాడో వ్యక్తి. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, అరుట్ల గ్రామానికి చెందిన మహమ్మద్ అస్లాం అనే వ్యక్తి ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలేజీలోని స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్టూడెంట్లనేగాక.. ఇంజినీరింగ్ కాలేజీలో ఓ మహిళా ఫ్యాకల్టిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అశ్లీల ఫోటోలు ఉన్నాయని బెదిరించి ఫ్యాకల్టీని రూ. 3 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్, కందుకూరు, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లలోనూ ముగ్గురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టట్టి శనివారం నిందితుడిని అరెస్టు చేశారు.