పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు.. సహకరించలేదని సర్పంచ్ తల్లిని చంపేశాడు

పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు.. సహకరించలేదని సర్పంచ్ తల్లిని చంపేశాడు

కరీనంగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో సర్పంచ్ తల్లి హత్య కేసును పోలీసులు చేధించారు. డిసెంబర్ 4వ తేదీ సోమవారం ఓ వ్యక్తి ఇంటి ముందు కూర్చున్న సర్పంచ్ తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని కనగర్తి గ్రామంలో రామంచ కుమారస్వామి అనే యువకుడితో గొడవ పడి అతని భార్య పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. దీంతో తన భార్య కాపురానికి రావడం లేదని పంచాయతీ చేసి తీసుకురావాలని సర్పంచ్ పై కుమారస్వామి ఒత్తిడి చేశాడు.

 అయితే.. ఫ్యామిలీ విషయంలో తాను జోక్యం చేసుకోనని సర్పంచ్ భర్త వాసుదేవ రెడ్డి చెప్పడంతో రామస్వామి  కక్ష్య పెంచుకున్నాడు.  సర్పంచితో సహా వారి కుటుంబ సభ్యులను అందరినీ చంపాలని ప్లాన్ చేసి.. కత్తితో సర్పంచ్ ఇంటికె వెళ్లాడు. అదే సమయంలో  ఇంటి ముందు కూర్చుని ఉన్న సర్పంచ్ తల్లి మట్టె లచ్చమ్మ(70)ను కుమారస్వామి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లచ్చమ్మ  మృతి చెందింది. దాడి చేసిన వ్యక్తిని గ్రమాస్తులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.