మందు తాగుతున్న వ్యక్తిని కొట్టి బంగారు ఆభరణాలు చోరీ

మందు తాగుతున్న వ్యక్తిని కొట్టి బంగారు ఆభరణాలు చోరీ

మేడిపల్లి, వెలుగు: ఒంటరిగా కూర్చొని మద్యం తాగుతున్న ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేసి మొబైల్‌‌‌‌‌‌‌‌, బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. పీర్జాడిగూడ నరసింహారెడ్డి కాలనీకి చెందిన మొరంపూడి అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌(46) ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి. ఈ నెల 5న మల్లాపూర్‌‌‌‌‌‌‌‌లోని కనకదుర్గ వైన్స్‌‌‌‌‌‌‌‌లో లిక్కర్​ కొన్నాడు.

మణికంచంద్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ రోడ్స్‌‌‌‌‌‌‌‌ – బోడుప్పల్‌‌‌‌‌‌‌‌ మార్గంలో ఉన్న ఓ నిర్మానుష్య వెంచర్‌‌‌‌‌‌‌‌లో కూర్చొని మద్యం సేవిస్తుండగా హోండా యాక్టివాపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని యువకులు ఆయనపై దాడి చేసి మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌, రెండు తులాల బంగారు గొలుసు, బంగారు ఉంగరం, వాలెట్‌‌‌‌‌‌‌‌ లాక్కొని పరారయ్యారు. ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో బాధితుడు ఆలస్యంగా ఆదివారం మేడిపల్లి పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశాడు.