హైదరాబాద్ వారాసిగూడలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని అమ్మాయిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. సోమవారం ( డిసెంబర్ 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్ బస్తీలో పవిత్ర అనే 18 ఏళ్ళ అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడు సమీప బంధువు ఉమాశంకర్.
ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి పవిత్రను కత్తితో పొడిచి హత్య చేశాడు ఉమాశంకర్. టైల్స్ పని చేసే ఉమాశంకర్ తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని పవిత్రను వేధిస్తుండేవాడని తెలుస్తోంది. ఉమాశంకర్ తాగుబోతు కావడంతో పవిత్ర పెళ్ళికి ఒప్పుకోలేదని తెలిపారు పవిత్ర పేరెంట్స్. దీంతో కోపం పెంచుకున్న ఉమాశంకర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని అంటున్నారు పవిత్ర పేరెంట్స్.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమితం పవిత్ర మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు.
