వీడియో : టీవీని పెద్ద మిక్సీలో వేస్తే ఎలా ఉంటుంది..

వీడియో : టీవీని పెద్ద మిక్సీలో వేస్తే ఎలా ఉంటుంది..

మిక్సీ లేదా గ్రైండర్లో కూరగాయలను, ఇతర తినే వస్తువులను వేస్తే ఏమవుతుంది. ముక్కలు ముక్కలు అవుతుంది. కదా..మరి టీవీని వేస్తే..కూడా ముక్కలు ముక్కలు అవుతుందా..? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు ఓ వ్యక్తి..మిక్సీలో టీవీని వేశాడు. ఆ తర్వాత ఏమైందంటే..?

ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. టీవీని మిక్సీలో వేస్తే ఏమవుతుందో అంటూ భారీ ప్రయోగాన్ని జనానికి చూపెట్టారు. బహిరంగ ప్రదేశంలో ఓ భారీ మిక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఓ స్మార్ట్ టీవీని పెట్టారు. కొద్ది దూరంలో ఆన్ , ఆప్ బటన్లను సిద్ధం చేశారు. ఓ వ్యక్తి..ఈ విషయాలను చెబుతూ బటన్ల దగ్గరకు పరిగెత్తాడు. అక్కడకు వెళ్లిన తర్వాత 1,2,3 అని లెక్కపెట్టి ఒక్కసారిగా గ్రీన్ బటన్ ప్రెస్ చేశాడు. అంతే.. కేవలం 2 సెకన్లలో టీవీ నుజ్జు నుజ్జు అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. 

 ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల వరకు వీక్షించారు.  అంతేకాకుండా  14 వేల మంది లైక్స్  చేశారు.