
కరీంనగర్‌లో దారుణం జరిగింది. బైపాస్ రోడ్‌లో ఓవ్యక్తిని పారతో దారుణంగా కొట్టి చంపారు దుండగులు. చనిపోయిన వ్యక్తిని కరీంనగర్ హనుమాన్ నగర్‌కు చెందిన నర్సయ్యగా గుర్తించారు పోలీసులు. నర్సయ్య మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నర్సయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.