కుక్కను.. కుక్కను కొట్టినట్లు బెల్ట్ తో కొట్టాడు..  

కుక్కను.. కుక్కను కొట్టినట్లు బెల్ట్ తో కొట్టాడు..  

కుక్కలు కరిచి చనిపోతున్న పిల్లల సంఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి.. తెలంగాణ రాష్ట్రంలోనే ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు వైరల్ అయ్యాయి. అంతే కాదు కుక్కల దాడిలో గాయపడుతున్న ఇన్సిడెంట్స్ రోజూ జరుగుతూనే ఉన్నాయి. దీనిపై రాంగోపాల్ వర్మ పదే పదే ట్విట్స్ వేయటం.. వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీని ఎఫెక్ట్ ఏమో కానీ.. తన వైపు వస్తున్న ఓ కుక్కను.. నడుంకు ఉన్న బెల్ట్ తీసి..చావ కొట్టాడు ఓ వ్యక్తి. ఆ కుక్క కుయ్యో మొర్రో అంటున్నా వదల్లేదు.. చచ్చేలా కొట్టాడు. ఎంతలా అంటే.. ఆ కుక్క అటూ ఇటూ తప్పించుకోవటానికి వీల్లేకుండా.. తనపై ఎదురుదాడి చేయటానికి కూడా ఓపిక లేకుండా చచ్చినట్లు పడేలా.. చావ కొట్టాడు ఆ వ్యక్తి.

హర్యానా రాష్ట్రం రోహ్​తక్  ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి డాబాపై ఉన్నాడు. అక్కడే ఉన్న ఓ కుక్కను తన బెల్ట్ తో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఆ తర్వాత కుక్కను ఇంటి పైనుంచి కిందకు విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన జంతు ప్రేమికుడు అరవింద్ కుమార్.. ఆ ప్రాంతానికి వెళ్లి కుక్కను రక్షించారు. ఆ కుక్కకు రెండు ఎముకలు విరిగాయని.. నడవలేని స్థితిలో ఉందని వివరించాడు. జంతు హింస కింద ఆ వ్యక్తిపై రోహ్ తక్ ప్రాంత పరిధిలోని ఆర్యనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. దీనిపై కంప్లయింట్ ఫైల్ చేశారు పోలీసులు. నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు ఆర్యనగర్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ సతీష్​ కుమార్.

కుక్కను కావాలనే హింసించాడని.. కొట్టాడని.. ఇది నేరం అంటున్నాడు జంతు ప్రేమికుడు అరవింద్. నిందితుడిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని.. కుక్క కేసు అని లైట్ తీసుకోవద్దంటూ పోలీసులను డిమాండ్ చేస్తున్నాడు. నిందితుడిని పట్టుకుంటే కానీ అసలు విషయం తెలియదని.. కుక్కకు.. కుక్కను కొట్టినట్లు కొట్టటానికి కారణాలు ఏంటో తెలుసుకుంటామని చెబుతున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు, వైరల్ వీడియో ఆధారంగా అతన్ని పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.