ఛీ యాక్ : విమానంలో సీట్ల మధ్య చుచ్చూ పోసిన ప్రయాణికుడు

ఛీ యాక్ : విమానంలో సీట్ల మధ్య చుచ్చూ పోసిన ప్రయాణికుడు

ముంబై-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో మల విసర్జన చేసిన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. విమానం గగనతలంలో ఉన్న సమయంలో నేలపై మల, మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలతో ఢిల్లీలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 24న ఏఐసీ 866 విమానంలో ఈ ఘటన జరిగిందని వారు చెప్పారు.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, సీటు నంబర్ 17ఎఫ్‌లో ప్రయాణిస్తున్న రామ్ సింగ్ అనే వ్యక్తి విమానంలోని 9వ వరుసలో మల, మూత్ర విసర్జనతో పాటు ఉమ్మివేశాడు. అతని దుష్ప్రవర్తన గమనించిన క్యాబిన్ సిబ్బంది.. ప్రయాణీకుడికి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్‌కు, కంపెనీకి సమాచారాన్ని అందించారు. ఈ చర్య చాలా మంది ప్రయాణికులను ఆందోళనకు గురిచేసిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అనంతరం ఎయిర్ ఇండియా సెక్యూరిటీ హెడ్ అక్కడికి చేరుకుని.. నిందితుడైన ప్రయాణికుడిని ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ALSO READ :అరెస్టులు చేస్తున్నా ఆగని..నకిలీ సీడ్​ దందా

నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 294 (అశ్లీల చర్యలు). 510 (మద్యం సేవించిన వ్యక్తి దుష్ప్రవర్తన) కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ లో నమోదైంది. నవంబర్ 26, 2022న, మత్తులో ఉన్న ఒక వ్యక్తి, న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళా సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. పది రోజుల తర్వాత, డిసెంబరు 6న పారిస్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలోనూ ఒక మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసి, నానా హంగామా సృష్టించాడు.