Harley-Davidson: 11 లక్షల బైక్‌పై పాల వ్యాపారం

Harley-Davidson: 11 లక్షల బైక్‌పై పాల వ్యాపారం

మామూలుగా ఎవరైనా పాలు అమ్మేందుక ఎలాంటి వాహనాన్ని ఉపయోగిస్తుంటారు.. సైకిల్ లేదా ఏదో చిన్నపాటి ద్విచక్రవాహనాన్ని, మరీ కొంచెం కెపాసిటీ ఎక్కువైతే ఆటో.. ఇలాంటి వెహికిల్స్ ని మాత్రమే చూస్తూం ఉంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రీమియం బైక్ పై పాలమ్ముతూ.. కెమెరాకు చిక్కాడు. అత్యంత ఖరీదైన హార్లే డేవిడ్ సన్ బైక్ కు పాల క్యాన్లు తగిలించుకొని పాలు అమ్మేందుకు అమ్మేందుకు వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వ్యక్తి ఇంటింటికీ వెళ్లి పాలు పోసేందుకు హార్లే డేవిడ్ సన్ బైకును ఉపయోగిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇది ఎక్కడ, ఏంటీ అన్న విషయాలు మాత్రం తెలియరాలేదు.. కానీ ఈ వీడియోను అమిత్ బదనా అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. కానీ దీనికి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే పాలు అమ్మేందుకు ఈ వ్యక్తి హార్లే డేవిడ్ సన్ బైక్ పై వెళ్తు్న్నాడు... అని చెప్పడానికి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఈ బైక్ ఖరీదెంతో తెలుసా.. దాదాపు 11 లక్షలు. అందుకే మరి ఇంత గొప్పగా చెప్పేది...