చేతులెలా వచ్చాయిరా నీచుడా..! ఏడేళ్ల పాపను చంపేసి... ఇంట్లోనే డ్రమ్ములో దాచి..

చేతులెలా వచ్చాయిరా నీచుడా..! ఏడేళ్ల పాపను చంపేసి... ఇంట్లోనే డ్రమ్ములో దాచి..

ఏపీలోని  అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను హత్య చేసిన నిందితుడు తన ఇంట్లోనే డ్రమ్ములో దాచిపెట్టాడు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లి కట్లాటపల్లి రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ( ఫిబ్రవరి 16 ) రిషిక అనే ఏడేళ్ల బాలిక అదృశ్యమైంది. పాప కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. అదృశ్యమైన రిషిక హత్యకు గురైందని.. రిషికను కులవర్దన్ అనే వ్యక్తి హత్య చేసి మృతదేహాన్ని తన ఇంట్లోనే డ్రమ్ముల్లో దాచినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు కులవర్దన్ ఇంట్లో పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో నిందితుడి ఇంటి దగ్గర భారీగా స్థానికులు గుమిగూడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలిక మృతదేహాన్ని తరలించేందుకు వీల్లేదంటూ అడ్డుపడుతున్నారు స్థానికులు. పసిపాపను ఇంత దారుణంగా చంపేందుకు చేతులెలా వచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పాపను కిరాతకంగా చంపిన నిందితుడిని వదలొద్దని.. కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు, బంధువులు.