
హైదరాబాద్ సిటీ శివార్లలోని శంషాబాద్ లో ఊహించని ఘటన. అన్నమయ్య అనే హోటల్ ఉంది. అక్కడికి టిఫిన్ తినటానికి ఓ కస్టమర్ వచ్చాడు. టిఫిన్ ఆర్డర్ చేశాడు.. టిఫిన్ తింటూ తింటూనే కుప్పకూలిపోయాడు. తింటున్న మనిషి అలా కుప్పకూలిపోయే సరికి హోటల్ సిబ్బంది, అక్కడ ఉన్న మిగతా కస్టమర్లు షాక్ అయ్యారు. 2025, అక్టోబర్ 17వ తేదీన జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
శంషాబాద్ లోని అన్నమయ్య హోటల్ కి టిఫిన్ చేసేందుకు వచ్చాడు ఓ కస్టమర్. టిఫిన్ చేస్తుండగా.. కూర్చున్నచోటే కుప్పకూలాడు కస్టమర్. టిఫిన్ చేస్తున్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు షాక్ అయ్యారు. వెంటనే 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు సిబ్బంది. ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కుప్పకూలిన వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.మృతుడు రంగారెడ్డి జిల్లా కొత్తురు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ తరహా మరణాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. అప్పటిదాకా యాక్టివ్ గా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలు ఇటీవల ఎక్కువవుతుండటం ఆందోళన కలిగించే విషయమని.. వయసుతో సంబంధం లేకుండా అందరూ క్రమం తప్పకుండా గుండె, ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.