లవ్ ఫెయిల్యూర్​తో చనిపోతున్నా..

లవ్ ఫెయిల్యూర్​తో చనిపోతున్నా..

ఎల్‌బీనగర్,వెలుగు: ప్రేమ విఫలమైందని..తనను అందరూ మోసం చేశారంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బ్రహ్మం(34) శనివారం ఉదయం సిటీకి వచ్చాడు. వనస్థలిపురంలోని వీఎంఆర్ గ్రాండ్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. సాయంత్రం   మద్యం తాగి రాత్రి 8 గంటలకు రూమ్​కి వెళ్లాడు. తన ప్రేమ విఫలమైందని, ఫ్రెండ్స్ కూడా తనను మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో తీసుకుని రూమ్​లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేక్ బ్రహ్మంకు గతంలోనే పెళ్లయినట్లు వీడియోలో పేర్కొన్నాడని పోలీసులు చెప్తున్నారు.