Summer season: చెమట కంపు వేధిస్తుందా..అయితే ఈ చిట్కాలు పాటించండి..

Summer season:  చెమట కంపు వేధిస్తుందా..అయితే ఈ చిట్కాలు పాటించండి..


ఎండలు ముదురుతున్నాయి.. రెండు నిమిషాలు ఫ్యాన్​.. ఏసీ లేకపోయినా.. బయటకు వెళ్లి వచ్చినా సరే చెమట కంపుకొడుతుంది.  పక్కన కూర్చున్న వారు అసహనం వెళ్లగక్కుతుంటారు.  ఇలా చెమట వాసన రాకుండా ఏం చేయాలో ఈస్టోరీలో తెలుసుకుందాం.. 

  •  ఒక టీస్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లిక్విడ్​ ను  ఒక కప్పు నీళ్లలో వేసి, కలపాలి. ఆ నీళ్లలో శుభ్రమైన టవల్ ని ముంచాలి. చెమట ఎక్కువగా పట్టే బాహుమూలలు, పాదాల దగ్గర ఆ టవల్​ తో  తుడుచుకుంటే చెడు వాసనకు కారణమయ్యే క్రిములు పోతాయి.
  •  వర్కవుట్ డ్రెస్ ని ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. లేదంటే చెమట పట్టిన వాటి మీద బ్యాక్టీరియా చేరి, శరీరం నుంచి చెడు వాసన వస్తుంది.
  •  రాత్రిపూట నిద్రపోయే ముందు బాహుమూలలు, పాదాలకి యాంటీపర్ స్పిరెంట్ రాసుకోవాలి. ఇవి రాసుకుంటే చెమట ఎక్కువ పట్టదు. వదులుగా ఉండే సాక్స్, షూ వేసుకోవాలి. 
  • నిమ్మరసం పిండిన బకెట్ నీళ్లలో కొంచెం సేపు పాదాల్ని పెడితే... వాటి చెమట వాసన పోతుంది.
  • అంతేకాదుసమ్మర్​  సీజన్లో రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. నీళ్లు బాగా తాగాలి. వేపుళ్లు, మసాలా ఫుడ్ ఎక్కువ తినొద్దు.