గంటన్నరలోనే 22పెగ్గులు.. ఆ తర్వాత..

గంటన్నరలోనే 22పెగ్గులు.. ఆ తర్వాత..

మార్క్ సి అనే బ్రిటీష్ పర్యాటకుడు పోలీష్ స్ట్రిప్ క్లబ్ లో కేవలం 90నిమిషాల్లోనే 22పెగ్గుల ఆల్కహాల్ సేవించి చనిపోయాడు. అతను మరణించే సమయంలో అతని రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ కనీసం 0.4 శాతం ఉండడంతో అది మరణానికి దారితీసింది. సాధారణంగా ఆల్కహాల్ విషప్రయోగం జరిగి రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.3 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతూంటాయి.

వివరాల్లోకి వెళితే.. 36 ఏళ్ల మార్క్ అతని స్నేహితుడితో కలిసి క్రాకోలోని వైల్డ్ నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ ఇచ్చిన ఫ్రీ ఎంట్రీ ఆఫర్ కు పడిపోయిన మార్క్.. వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదని భావించాడు. తనతో వచ్చిన స్నేహితుడు కూడా ఈ ఉచిత ప్రవేశం ఆఫర్ కు అట్రాక్ట్ అయ్యాడు. కానీ అతను ఎక్కువ తాగడానికి నిరాకరించాడు.

అలా మార్క్ కేవలం 90 నిమిషాల్లోనే 22 షాట్‌లు తీసుకున్నాడుత. ఆ తర్వాత తూలుతూ కుప్పకూలాడు. అనంతరం మరణించాడు. అంతే కాదు అతను పడిపోయిన తర్వాత క్లబ్ సిబ్బంది అతని వద్దనుంచి కొంత నగదును కూడా దోచుకున్నారు. పోలిష్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CBSP) ప్రకారం, క్లబ్‌లు ఒక రాకెట్‌ను నడుపుతాయి, కస్టమర్‌లను తాగి, ఆపై వారిని దోచుకుంటాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీబీఎస్పీ పేర్కొంది.

 అతను మత్తులో ఉండి, స్పృహ కోల్పోయి, ఆపై తీవ్రమైన ఆల్కహాల్ పాయిజనింగ్ ఫలితంగా మరణించాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. సంఘటన సమయంలో వ్యక్తికి వైద్య సహాయం అందించలేదని, ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వారిపై తాత్కాలిక అరెస్టులు చేశామని తెలిపారు. ఈ విషాద సంఘటన తర్వాత పోలిష్ పోలీసులు అనేక నైట్‌క్లబ్‌లపై దాడి చేసి అటువంటి క్రైమ్ రాకెట్లను ఛేదించారు.