అపార్ట్​మెంట్​ రెండో ఫ్లోర్​ నుంచి పడి మరొకరు..

అపార్ట్​మెంట్​ రెండో ఫ్లోర్​ నుంచి పడి మరొకరు..

మియాపూర్​, వెలుగు: అపార్ట్​మెంట్​ రెండో ఫ్లోర్​ నుండి కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఏపీలోని భీమవరంలోని ఏఎస్​ఆర్​నగర్​కు చెందిన పాతపాటి దేవి, శ్రీనివాసరాజు(53) నెల రోజుల క్రితం మియాపూర్​ మయూరినగర్​లోని దివ్యశ్రీ శక్తి అపార్ట్​మెంట్​లో నివాసం ఉండే తమ కుమార్తె రమ్య తేజశ్విని ఇంటికి వచ్చారు. వీరు అపార్ట్​మెంట్​ 5వ బ్లాక్​లోని రెండవ ఫ్లోర్​లో ఉంటున్నారు.  సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో అందరూ టిఫిన్​ చేస్తుండగా శ్రీనివాసరాజు ఇంట్లో నుండి కారిడార్​లోకి వచ్చాడు. 

ఇదే సమయంలో పెద్ద శబ్ధం రావడంతో ఇంట్లోని కుటుంబసభ్యులు బయటకు వచ్చి చూడగా శ్రీనివాసరాజు రెండవ ఫ్లోర్​ కారిడార్​ నుండి కిందపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు గాయాలతో ఉన్న శ్రీనివాసరాజును సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే శ్రీనివాసరాజు గత ఆరు నెలలుగా హైబీపీ, షుగర్​తో భాదపడుతున్నాడని, అప్పుడప్పుడూ టెన్షన్​ పడేవాడని, ఈ క్రమంలో రెండవ ఫ్లోర్​ నుండి కింద దూకి ఉండొచ్చని కుటుంబసభ్యులు మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.