నిజామాబాద్ జిల్లాలో  కల్లులో మద్యం కలుపుకొని తాగి ఒకరి మృతి.. మరొకరి  పరిస్థితి విషమం

 నిజామాబాద్ జిల్లాలో  కల్లులో మద్యం కలుపుకొని తాగి ఒకరి మృతి.. మరొకరి  పరిస్థితి విషమం
  •  నిజామాబాద్ జిల్లా అంబం గ్రామంలో ఘటన

బోధన్, వెలుగు : కల్లులో మద్యం కలుపుకొని తాగడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నీరడి విఠల్ (45), జుడగలి లక్ష్మయ్య వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరూ కలిసి బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారి నర్సాపూర్​గేటు వద్ద ఉన్న కల్లు దుకాణానికి వెళ్లారు.

అక్కడ కల్లును తీసుకొని అందులో మద్యం కలుపుకొని తాగారు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై విఠల్​అక్కడికక్కడే చనిపోగా, లక్ష్మయ్య అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు లక్ష్మయ్యను 108లో బోధన్​ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉందని 
తెలుస్తోంది.