- నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఘటన
దేవరకొండ (చింతపల్లి), వెలుగు : భూమి గెట్టు విషయంలో రెండు వర్గాలు కొట్టుకోగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాకు చెందిన నేనావత్ రవీందర్ నాయక్, రాజేందర్‌నాయక్, రవి నాయక్‌కు తక్కల్లపల్లి గ్రామ సమీపంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూమి గెట్టు విషయంలో రాజేందర్‌నాయక్, రవినాయక్‌కు ఆదివారం సాయంత్రం రవీందర్‌తో గొడవ మొదలైంది.
ఈ క్రమంలో మాటమాట పెరగడంతో ఇరు వర్గాలు కర్రెలతో కొట్టుకొని, రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రవీందర్‌నాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రవీందర్‌నాయక్‌ను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
