సివిల్ సర్వీసెస్ అంటే ఎంత కాంపిటీషన్.. ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలిసినవిషయమే. దేశంలోనే అత్యుతన్నమైన ప్రభుత్వ సర్వీస్ లో జాబ్ కొట్టి.. సివిల్ సర్వెంట్ గా పనిచేయాలని ఎంతో మంది పోటీ పడుతుంటారు. ఊరు, రాష్ట్రం వదిలి.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి ప్రపేర్ అయ్యేవాళ్లున్నారు. ఏండ్లకు ఏండ్లు చదువుతూ.. చివరి అటెంప్ట్ వరకు ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వారినే టార్గెట్ చేసి.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 60 లక్షల రూపాయలు నొక్కేశారు కేటుగాళ్లు.
ఈ భారీ మోసం ముంబైలో జరిగింది. ముంబైకి చెందిన ఇర్షద్ ఖాన్ అనే వ్యక్తి మల్వానీ ఏరియాలో హోటల్ నడుపుతుంటాడు. అతని కొడుకు సద్దాం ఖాన్.. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసి UPSC సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు అటెంప్ట్స్ చేసినా జాబ్ రాలేదు. ప్రస్తుతం 5వ అటెంప్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
అయితే యాకూబ్ షేక్ అనే వ్యక్తి తరచూ హోటల్ కు వస్తూ.. అబ్బాయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడనే విషయం తెలిసి.. మంచి ప్లాన్ వేశాడు. సీఐడీ ఆఫీసర్ అయిన తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పి.. సహాయం చేస్తానని చెప్పాడు. ఇర్షద్ ఖాన్ ను విజయ్ చౌదరీ అనే వ్యక్తికి పరిచయం చేశాడు. యూపీఎస్సీలో ఏ స్థాయి వ్యక్తినైనా మేనేజ్ చేస్తారని నమ్మించారు. కొంత ఎమౌంట్ తో యూపీఎస్సీ సివిల్స్ క్లియర్ అయ్యేలా సెటిల్ చేస్తానని చెప్పాడు.
ఢిల్లీ కమిషనర్ తో.. యూపీఎస్సీ ఛైర్మన్ తో మాట్లాడున్నట్లు ఇర్షద్ ఖాన్ ముందే ఫోన్ చేసి మాట్లాడేవాడు. దీంతో ఇర్షద్ ఖాన్ వారి మాటలు పూర్తిగా నమ్మేశాడు. నిజంగానే సివిల్స్ పాస్ చేయిస్తారని నమ్మి.. విడతల వారీగా భారీగా సమర్పించుకున్నాడు. ఆ రకంగా మొత్తం 60 లక్షల రూపాయలను గుంజేశారు దుండగులు.
మతం కారణంగానే అంటూ బుకాయింపు:
అయితే ఫిఫ్త్ అటెంప్ట్ ఎగ్జామ్ రాసిన సద్దాం.. రిజల్ట్ మాత్రం అలాగే ఉండే సరికి.. సివిల్స్ పాస్ చేయిస్తామని చెప్పారు కదా.. రాలేదు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ప్రయత్నం చేశామని కానీ.. కుదరలేదని.. సద్దాం ఫెయిల్ కావకడానికి కారణం.. అతని మతం అని చెప్పారు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఇర్షద్ ఖాన్.. పోలీసులకు కంప్లైట్ ఇచ్చాడు. ఫిర్యాదు మేరకు యాకుబ్ షేక్ ను పోలీసులు అరెస్టు చేయగా.. విజయ్ చౌదరి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నమ్మేటోళ్లు ఉండాలి గానీ.. ప్రధాని మోదీ మా తాత అని చెప్పే జాదూ గాళ్లు ఉన్నారిక్కడ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలున్నాయని.. ఏ పనైనా అయిపోతుందని మోసం చేస్తూ డబ్బులు దండుకునే బ్యాచ్ చేసే పనులు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. యూపీఎస్సీలో అంతా మనోళ్లే ఉన్నారు.. సివిల్స్ క్లియర్ చేయిస్తానని చెప్పి.. 60 లక్షల రూపాయలు నొక్కేశారు కేటుగాళ్లు.
