హెల్ప్ చేస్తానంటూ వచ్చి ATM కార్డు మార్చి.. రూ.లక్షలు కొట్టేశాడు

హెల్ప్ చేస్తానంటూ వచ్చి ATM కార్డు మార్చి.. రూ.లక్షలు కొట్టేశాడు

ఏటీఎం సెంటర్లో హెల్ప్ చేస్తామంటూ వచ్చి క్షణాల్లో మీ కళ్లు కప్పి అకౌంట్లో డబ్బు మాయచేస్తుంటారు. ఇలానే మోసం చేస్తూ మహారాష్ట్రంలో ఓ వ్యక్తి రూ.8 లక్షలు కొట్లేశాడు. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన దీపక్ ఝూ ఎప్పుడూ ఏటీఎం సెంటర్ల చుట్టే తిరుగుతుంటాడు. అతను ఉల్హాస్‌నగర్‌లో నివాసం ఉంటాడు.  డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారికి సహాయం చేస్తున్నట్లుగా నటించి మన కార్డ్ తో డబ్బులు డ్రా చేసి ఇస్తాడు. ఈ టైంలో ఏటీఎం పిన్ అతడే ఎంటర్ చేసి నెంబర్ తెలుసుకుంటాడు. తర్వాత కార్డ్ ఇచ్చేటప్పుడు మన కార్డ్ కు బదులుగా వేరే డూప్లికేట్ కార్డ్ ఇస్తాడు.

వారు అక్కడి నుంచి వెళ్లిపోయాక ఓరినల్ కార్డ్ నుంచి దీపక్ తెలుసుకున్న పిన్ ఎంటర్ చేసి అందులో నగదు కాజేస్తాడు. ఇలా ఇప్పటివరకు దీపక్ 16 సార్లు మోసం చేసి చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల ఇద్దరు మహిళలను, ఓ వ్యక్తి కళ్లు కప్పి డబ్బు కొట్టేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. సీసీపుటేజ్ ఆధారంగా దీపక్ ఝూని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుంచి  ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.