
గండిపేట, వెలుగు: అత్తాపూర్‌లో ఓ యువకుడు తొమ్మిదో ఫ్లోర్ నుంచి కిందపడి గాయపడ్డాడు. ఓల్డ్ సిటీకి చెందిన సోహెల్ ఫాల్ సీలింగ్ వర్క్ చేసేందుకు బుధవారం అత్తాపూర్‌కు వచ్చాడు. శిఖరావన్ అపార్ట్మెంట్స్లోని తొమ్మిదో ఫ్లోర్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. పైనుంచి నేరుగా కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడ్డాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తీవ్రగాయాలతో ఉన్న ఆ యువకుడిని వెంటనే ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు.