అన్నదానం.. వస్త్రదారం.. సువర్ణదానం.. భూదానం.. గోదానం ఇలా అనేక దానాలు చేస్తారు. కాని నెదర్ ల్యాండ్స్ ఓ వ్యక్తి విచిత్రంగా వీర్యదానం చేసి చిక్కుల్లో పడ్డాడు. అంతేకాదు ఆయన 550 మందికి తండ్రి అయ్యాడు .అదెలా సాధ్యమనుకుంటున్నారా.. ఇది నిజం.. అతని వయస్సు 41. పేరు జానథన్ జేకబ్ మేజిర్. అంతమందికి తండ్రి అయిన వ్యక్తిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. అతనికి దాదాపు కోటి రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది. 41 ఏళ్ల వ్యక్తి 550మందికి పిల్లలకు తండ్రా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ అతను వీర్యదానంతో 550మందికి తండ్రి అయ్యాడు. సంతానం లేనివారికి వీర్యదానం అనేది ఓ అవకాశమే. కానీ వీర్యదానం చేయటానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇష్టానుసారంగా వీర్యదానం చేసుకుంటు పోతే వారికి పుట్టిన పిల్లలు ఒకరికొరు తోడబుట్టిన వారయ్యే పరిస్థితి దాపురిస్తుంది. అందుకే దేనికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. నియంత్రణలు రూల్స్ ఉంటాయి. వాటిని అనుసరించే చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇదిగో నెదర్లాండ్ లో జాకబ్ మీజర్ అనే వ్యక్తికి జరిగిందే జరగొచ్చు..ఇంతకీ ఎవరీ జాకబ్ మీజర్? అతను చేసిందేంటీ?550మందికి వీర్యదానం ఎలా చేశాడు?
సంతానం లేని వారిని మోసం చేసి వీర్యదానం ప్రక్రియను కొనసాగించి నింబంధనలు ఉల్లంఘించిన నెదర్ ల్యాండ్స్ కు చెందిన 41 ఏళ్ల జాకబ్ మీజర్ పై కోర్టులో కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జాకబ్ ఇక వీర్యదానం చేయటం ఆపేయాలని కోర్టు నిషేధం విధించింది. వీర్యదానంతో సుమారు 550 మందికి తండ్రయిన ఓ వ్యక్తి ఇకపై స్పెర్మ్ డొనేషన్ చేయకూడదంటూ నెదర్ ల్యాండ్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. వీర్య దానం చేశానన్న విషయాన్ని దాచి పెట్టిన నిందితుడు సంతానం లేనివారిని మోసం చేసినట్టు తేలడంతో కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 28,2023) ఈ తీర్పునిచ్చింది. అంతేకాదు జాకబ్ కు 1,00,000 యూరోలు భారత్ కరెన్సీలో రూ.90 లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.
జానథన్ మేజిర్ పై ఓ మహిళతో పాటు ఓ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు కోర్టులో పిటీషన్ వేశారు. జానథన్ పై అభియోగాలు పరిశీలించిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. ‘‘గతంలో వీర్యదానంతో తను అనేక మందికి తండ్రయిన విషయాన్ని నిందితుడు దాచిపెట్టాడు. దీంతో, వందల మంది వ్యక్తులు తాము ఒకరికొరు తోడబుట్టిన వారయ్యే పరిస్థితి దాపురించింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జానథన్ ఇప్పటివరకూ 13 సంతాన సాఫల్య కేంద్రాల్లో వీర్యదానం చేసినట్టు తేలింది. వీటిల్లో 11 కేంద్రాలు నెదర్ ల్యాండ్స్ లోనే ఉండంలో అతనిపై కేసు నమోదు చేయటం జరిగింది. అతను 2007 నుంచి అతడు వీర్యదానం చేస్తున్నాడు. ఏదో అన్నదానాలు, వస్త్రదానాలు చేసినట్లుగా.
నెనెదర్ ల్యాండ్స్ చట్టాల ప్రకారం, ఒక పురుషుడు 12 మంది కంటే ఎక్కువ మంది మహిళలకు వీర్యదానం చేయకూడదు. 25 మందికి మించి పిల్లలకు తండ్రి అవ్వకూడదు. అలా జరిగతే భవిష్యత్తులో తమకు వందల మంది తోబుట్టువులు ఉన్నారన్న విషయం పిల్లలు పెద్దయ్యాక తెలిస్తే మానసిక సమస్యలు తలెత్తొచ్చని ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. కానీ వాటిని జోనాథన్ అతిక్రమించాడు. ఏకంగా వీర్యదానాలు చేసుకుంటు పోయి ఇప్పటి వరకు 550మందికి తండ్రి అయ్యాడు. కోర్టు ఇచ్చిన తీర్పుతో బాధిత మహిళ హర్షం వ్యక్తం చేసింది. అతనికి కోర్టు ఇటువంటి తీర్పు ఇవ్వకపోతే ఇంకెంతమందికి వీర్యదానం చేసి సమాజాన్ని అల్లకల్లోలం చేసేవాడో అంటూ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచమంతా ఇతని సంతానమే వ్యాపించే భయానక పరిస్థితి దాపురించేదంటూ ఆందోళన వ్యక్తంచేసింది.
