ఆఫీసులో సిగరెట్ బ్రేక్స్ కింద.. రూ. 9 లక్షల జీతం కట్

ఆఫీసులో సిగరెట్ బ్రేక్స్ కింద.. రూ. 9 లక్షల జీతం కట్

అతను సిగరెట్లు తాగుతాడు.. బాగా తాగుతాడు.. ఆఫీసులోని స్మోకింగ్ జోన్ కు వెళ్లి మరీ దమ్ము మీద దమ్ము కొడతాడు.. ఆఫీసులో స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసినప్పుడు.. కంపెనీ కూడా పర్మీషన్ ఇచ్చినా..సిగరెట్ స్మోకింగ్ బ్రేక్స్ కింద 9 లక్షల రూపాయల జీతం కట్ చేసింది కంపెనీ.. అది ఎలా జరిగింది.. ఎందుకు అలా చేసింది అనేది వివరంగా తెలుసుకుందాం...

జపాన్ దేశంలోని ఒసాకా సిటీలోని ఓ రిటైర్ ఆఫీస్ లో 61 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడు. అతనితోపాటు మరో ఇద్దరు ఎక్కువగా సిగరెట్లు తాగుతున్నారు. ఒసాకాలోని బహిరంగ ప్రదేశాలు, స్కూల్స్, కమర్షియల్ ఏరియాల్లో స్మోకింగ్ అనేది నిషేధం. అయితే చాలా మంది ఆఫీసుల్లోనే.. స్మోకింగ్ ప్రాంతంలో సిగరెట్లు తాగుతుంటారు. దీనిపైనా కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 61 ఏళ్ల వ్యక్తితోపాటు మరో ఇద్దరు కొన్నేళ్లుగా ఎక్కువగా సిగరెట్లు తాగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించినా ఆఫీస్ యాజమాన్యం.. పలుసార్లు హెచ్చరించింది. ఇద్దరిలో మార్పు వచ్చినా.. 61 ఏళ్ల వ్యక్తిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నిసార్లు విన్నవించినా.. మనోడు మాత్రం దమ్ము మీద దమ్ము కొడుతూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. 

చిర్రెత్తుకొచ్చిన రిటైల్ కంపెనీ యాజమాన్యం.. 14 ఏళ్లుగా స్మోకింగ్ బ్రేక్ కింద 4 వేల సార్లు బ్రేక్ తీసుకున్నాడని తేల్చింది. ఈ మొత్తం సమయాన్ని లెక్కించి.. అతని జీతంలో 9 లక్షల రూపాయలు కట్ చేసింది. తొమ్మిది లక్షల రూపాయల జరిమానాతో షాక్ అయిన ఉద్యోగి.. లబోదిబో అంటూ రిక్వెస్టులు పెట్టుకున్నాడు. 14 ఏళ్లుగా మారనోడు.. ఇప్పుడు మారతాడు అని గ్యారెంటీ లేదని డిసైడ్ అయిన కంపెనీ.. ప్రతి నెలా జీతంలో 10 శాతం కోత పెట్టింది.. ఆరు నెలలపాటు తొమ్మిది లక్షల రూపాయలను అతని నుంచి వసూలు చేసింది. 

దీనిపై జపాన్ దేశంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫైన్ చాలా ఎక్కువగా ఉందని..ఇది టూమచ్ అంటూ కంపెనీని కొందరు దుమ్మెత్తిపోస్తుంటే.. అతని ఆరోగ్యం దృష్ట్యా కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు మరికొందరు. ఇంకొందరు అయితే బహిరంగ ప్రదేశాల్లో..ఆఫీసుల్లోస్మోకింగ్ నిషేధించబడింది కాబట్టి అతనికి జరిమానా విధించటం సరైనదే అంటున్నారు.. 

ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. సిగరెట్లు తాగుతున్నాడని 9 లక్షల రూపాయల ఫైన్ వేయటం మాత్రం ఘోరం అంటున్నారు ధూమపాన ప్రియులు...