కరోనా భయంతో హుస్సేన్ సాగర్లో దూకిండు

కరోనా భయంతో హుస్సేన్ సాగర్లో దూకిండు

రెండు రోజులైనా దొరకని డెడ్ బాడీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా వైరస్ సోకిందేమోననే భయంతో హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి డెడ్‌బాడీ రెండు రోజులైనా దొరకలేదు. శనివారం కూడా గాలించినా బాడీ దొరకకపోవడంతో ఆదివారం మరోసారి సెర్చ్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంగోపాల్‌‌‌‌పేట్‌ ‌‌‌పోలీసుల వివరాల ప్రకారం.. వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌కి చెందిన పల్టుపాన్‌‌‌‌ (34) దూద్‌‌‌‌బౌలిలో నివాసం ఉంటూ, లోకల్ గా బంగారం దుకాణం పెట్టుకున్నడు. పది రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో శుక్రవారం మలక్‌‌‌‌పేట్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌ ‌‌‌హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అక్కడి డాక్టర్లు గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో బయటికి వచ్చి తన దోస్తు శ్రీరాములుకు ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నడు. డాక్టర్లు చల్ల గాలి పీల్చాలని చెప్పారంటూ ట్యాంక్ బండ్ కు బయల్దేరాడు. లేపాక్షి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌లోకి దూకాడు. దీంతో శ్రీరాములు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పల్టుపాన్ ను కాపాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని, ఆయన డెడ్ బాడీ కూడా ఇప్పటి వరకు దొరకలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.

For More News..

కరోనా డేంజర్లో హైదరాబాద్

ప్రైవేటు ల్యాబుల్లో తప్పుడు రిజల్ట్స్

హైదరాబాద్ విడిచి సొంతూళ్లకు బాట