
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో ఓ మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. నెల్లూరు జిల్లాకు చెందిన షిండే సవాల్ అనే వ్యక్తి తాగిన మైకంలో భార్య రమ(26)ను కత్తితో పొడిచి చంపాడు. భార్య పైన అనుమానంతో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు.
షిండే సవాల్ కుటుంబం.ఊరూరు తిరుగుతూ సర్కస్ చేసుకుంటూ సంచార జీవనం సాగిస్తోంది. భార్యపై అనుమానం పెంచుకున్న షిండే గత రాత్రి ఒంటిగంట సమయంలో తాగిన మైకంలో ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.అనంతరం తనను తాను కత్తితో గాయపరుచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.