
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై రవి అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు వెంబడించి మరీ అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.