
- భోపాల్‌లో ఘటన
భోపాల్: తాగుడికి బానిసైన ఒక వ్యక్తి భార్యను చంపి ఎవరికి తెలియకుండా ఇంట్లోని డబుల్ కాట్ బెడ్ బాక్స్‌లో దాచి.. ఆ మంచంపైనే రెండు రోజుల పాటు ఉన్నాడు. భోపాల్ దగ్గర్లోని సాగర్‌లో ఈ ఘటన జరిగింది. షేర్ సింగ్ అహివార్, ఆర్తీ అహివార్ భార్య భర్తలు. భోపాల్ జిల్లాలోని సాగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య భర్తల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఫుల్‌గా తాగొచ్చిన షేర్‌సింగ్ భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత గొడ్డలి తీసుకుని ఆమెను నరికి చంపి బెడ్ కింద బాక్స్‌లో దాడి పెట్టి దాదాపు రెండు రోజుల పాటు ఆ బెడ్‌పైనే పడుకున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్తీ కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. అదీ కాక గొడ్డలి తీసుకుని చంపానని, తాగిన మత్తులో ఒకరిద్దరితో నిందితుడు చెప్పడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వచ్చి వెతికిన పోలీసులకు బెడ్ దగ్గర నుంచి వాసన రావడంతో తీసి చూసిన పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసి షహర్ సింగ్‌ను అరెస్టు చేశారు.