డాక్టర్ల వార్నింగ్.. ఏకంగా 165 కిలోలు తగ్గిండు

డాక్టర్ల వార్నింగ్.. ఏకంగా 165 కిలోలు తగ్గిండు

చాలా మందిని వేధించే సమస్యల్లో ఒకటి స్థూలకాయం. అధిక బరువుతో రోజూ వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. పెరిగిన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో కొంతమంది అనారోగ్యం పాలవడం కూడా చూస్తూనే ఉంటాం. అందులో కొందరు మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక బరువును తగ్గించుకుంటాయి. అదే కోవకు చెందిన ఓ వ్యక్తి.. అధిక బరువు కారణంగా ప్రాణాలకు అపాయం వచ్చే పరిస్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ల సూచన మేరకు 165కిలోల బరువు తగ్గి.. అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 

మిస్సిస్సిప్పికి చెందిన నికోలస్ క్రాప్ట్ అనే వ్యక్తి ప్రారంభంలో 300కిలోల బరువుండేవాడు. ఆ తర్వాత డాక్టర్లు హెచ్చరించడంతో ఆహార నియమాలు, వ్యాయామం చేసి ఒక్క నెలలోనే 18 కిలోల బరువు తగ్గాడు. నికోలస్ ఈ బరువు తగ్గించుకునే ప్రక్రియను 2019 నుంచి ప్రారంభించాడు. అతను హైస్కూల్ లో ఉన్నప్పుడు 136కిలోల బరువుండేవాడినని, డిప్రెషన్ వల్లే తాను అతిగా తినేందుకు కారణమైందని నికోలస్ చెప్పాడు. దాని ఫలితంగానే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. ఆ తర్వాత డాక్టర్ ను సంప్రదించగా.. మరో బరువు తగ్గకపోతే మరో 3 -5 సంవత్సరాలలో చనిపోయే ప్రమాదం ఉందని చెప్పినట్టు నికోలస్ చెప్పాడు. దీంతో జంక్ ఫుడ్ ను పూర్తిగా మానేసిన నికోలస్.. రోజుకు 1200 నుంచి 1500 కేలరీలను తగ్గించడంపై దృష్టి పెట్టాడు. దాంతో పాటు వ్యాయామం కూడా అతను బరువు తగ్గేందుకు కారణమైంది. ఈ రకమైన ప్రయత్నంతో నికోలస్ ఇప్పుడు మొత్తంగా 165 కిలోల బరువు తగ్గడం నిజంగా అభినందించదగ్గ విషయం.