నిజామాబాద్: కూర్చున్న సీటులోనే ప్రాణాలు వదిలిన ప్రయాణికుడు

నిజామాబాద్: కూర్చున్న సీటులోనే ప్రాణాలు వదిలిన ప్రయాణికుడు

నిజామాబాద్‌లో విషాదఘటన చోటుచేసుకుంది. కూర్చున్న సీటులోనే ఓ ప్రయాణికుడు కుప్పకూలాడు.సదరు వ్యక్తిని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నక్కలగుట్ట గ్రామానికి చెందిన కిరణ్‌గా గుర్తించారు. పని నిమిత్తం జిల్లాకు వచ్చిన కిరణ్ తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇప్పటికే పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడు గుండెపోటుతో మరణించాడా? లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్న  కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.