12 మంది రైల్వే ఉద్యోగులకు ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ అవార్డులు

12 మంది రైల్వే ఉద్యోగులకు ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ అవార్డులు

హైదరాబాద్, వెలుగు : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో అంకితభావంతో విధులు నిర్వహించిన 12 మంది ఉద్యోగులకు ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులు దక్కాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్, అడిషనల్​జీఎం ఆర్.ధనంజయులుతో కలిసి మంగళవారం సికింద్రాబాద్‌‌‌‌లోని రైల్ నిలయంలో భద్రతా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అవార్డులు పొందినవారిలో సికింద్రాబాద్ డివిజన్ నుంచి ముగ్గురు, హైదరాబాద్ డివిజన్ నుంచి ఒకరు

విజయవాడ డివిజన్ - నుంచి ఇద్దరు, గుంతకల్ డివిజన్ నుంచి ముగ్గురు, నాందేడ్ డివిజన్ నుంచి ఒకరు, గుంటూరు డివిజన్- నుంచి ఇద్దరు ఉన్నారు. వీరిలో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మ్యాన్, కీ/గేట్ మ్యాన్, ట్రాక్ మెయింటెయినర్లు ఉన్నారు. జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జోన్‌‌‌‌ పరిధిలో సేఫ్టీ డ్రైవ్‌‌‌‌లు కొనసాగించాలని, అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని

ఆదేశించారు. లోకో పైలట్లు, షంటర్లు, ట్రాక్ మెయింటెయినర్లు, గార్డులకు ఎప్పటికప్పుడు   భద్రతపై కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. అలాగే సరుకు రవాణాపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్‌‌‌‌లు పాల్గొన్నారు.