అమ్మాయి పేరెంట్స్ అడ్డు పడుతున్నారని.. సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు

అమ్మాయి పేరెంట్స్ అడ్డు పడుతున్నారని.. సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు

తమ ప్రేమకు అమ్మాయి పేరెంట్స్ అడ్డు పడుతున్నారని ఓ ప్రేమికుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగు పల్లిలో చోటు చేసుకుంది. మద్దిపాడు గ్రామా నికి చెందిన కోరితే కిష్టయ్య అనే యువకుడు సులుగుపల్లి గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. 

విషయం తెలిసినఅమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు నో చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు అమ్మాయి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. పోలీసుల రంగ ప్రవేశంతో గంట హైడ్రామా తర్వాత కిందకు దిగాడు. యువకుడిని అదుపులోకి తీసుకొని కౌన్సిలిం గ్ ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఓ వ్యక్తి 18 అంతస్తుల ఎత్తైన హైటెన్షన్ టవర్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. సోమవారం (అక్టోబర్ 27) అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యా యత్నం చేసిన వ్యక్తి.. 18 ఫ్లోర్ ల హైట్ ఉండే టవర్ పై నుంచి పడిపోయాడు. కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులు, హైడ్రా, ఫైర్ అధికారును కాదని అమాంతం అలాగే దూకేశాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ షాకింగ్ కు గురిచేస్తున్నాయి. 

హైటెన్షన్ టవర్ ఎక్కిన వ్యక్తి.. ఎంతమంది చెప్పినా కిందికి దిగలేదు. ఆత్మహత్య చేసుకుంటానని.. తనను ఎవరూ కాపాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది పెద్ద క్రేన్ సహకారంతో టవర్ ఎక్కారు.  అతి కష్టం మీద అతని దగ్గరికి  చేరుకుని కాపాడే ప్రయత్నం చేశారు.

నీ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాం.. సూసైడ్ చేసుకోవద్దు అని చెప్పినా.. దగ్గరకు రావద్దు దూకేస్తానని బెదిరించాడు. అయినా దగ్గరికి వెళ్లిన సిబ్బంది.. చేయి పట్టుకుని పైకి లాగే క్రమంలో.. విదిలించుకుని పైనుంచి దూకేశాడు. కావాలని దూకేశాడా లేక విదిలించుకునే ప్రయత్నంలో పడిపోయాడా అనేది క్లారిటీ లేనప్పటికీ.. అంత ఎత్తైన టవర్ పైనుంచి అలాగే పడిపోయాడు. బురదలో పడిపోవడంతో వెంటనే 108 కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు.