బంగారంతో చేశారా :రెండు దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ వెయ్యి రూపాయలు

బంగారంతో చేశారా :రెండు దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ వెయ్యి రూపాయలు

 రెండు ఇడ్లీలు.. రెండు దోసలు కలిపి సాధారణంగా బండిహోటల్లో అయితే రూ. 50.. అదే డబ్బా హోటళ్లలో అయితే రూ. 70 నుంచి రూ. 100 వరకు .. బ్రాండెట్​ హోటల్స్​ లో అయితే రూ. 100 నుంచి 150 వరకు ఉంటుంది.   అయితే రెండు దోసలు.... రెండు ఇడ్లీలు కలిపి వెయ్యి రూపాయిలట. అలాంటి రిచ్​ హోటల్​ ఎక్కడుందో తెలుసుకుందాం. . .

దక్షిణ భారతంలో నివసించే వారు ఎక్కువమంది భోజన ప్రియులు.  వారు ఎక్కడికి వెళ్లినా.. దొస, ఇడ్లీ .. టీ ఎక్కడ దొరుకుతుండా అని చూస్తుంటారు.  పేదవారైతే రోడ్డు పక్కన ఉండే బండి హోటళ్లు.. మధ్య తరగతి వారైతే.. డబ్బా హోటళ్లు.. రిచ్​ వారైతే కేఎఫ్ సీ లాంటి బ్రాండెట్​ హోటల్స్​.. ఎవరైనా సరే  అంటే దాదాపు 95 శాతం మంది ప్రజలు దోస.. ఇడ్లీలను లొట్టలేసుకొని తిని.. గ్లాసుడు టీ తాగి బేవ్​ మనడం మాత్రం పక్కా..

గురుగ్రామ్‌లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్‌లో ఆశిశ్‌ సింగ్‌ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్‌ ఇడ్లీ ఆర్డర్‌ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ వచ్చింది. హాయిగా దోశలు..  ఇడ్లీలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్‌కు ఒక్కసారిగా షాక్‌ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్‌ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్‌ చేశాడు. 

ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పోస్ట్​ కు ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి) 132K వీకక్షణలు వచ్చాయి.  దీనిపై నెటిజన్లు  స్పందించారు.    ఆశిష్‌ ట్వీట్‌పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్‌ అని ఒకాయన కామెంట్‌ చేశాడు. వీధి టిఫిన్‌ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి  అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి అని   కర్ణాటక వ్యక్తి కామెంట్‌ పెట్టాడు.