ఓ వ్యక్తి బ్యాగులో బాంబు పెట్టి వెళ్లాడు : సీఎం సిద్ధరామయ్య

ఓ వ్యక్తి బ్యాగులో బాంబు పెట్టి వెళ్లాడు : సీఎం సిద్ధరామయ్య

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో శుక్రవారం (మార్చి 1) జరిగిన బాంబ్ బ్లాస్ట్ పై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఓ వ్యక్తి కేఫ్ లో బ్యాగ్ ని వదిలేసి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిందని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఆ బ్యాగులోని వస్తువు కేఫ్ లో పేలుడుకు కారణమైందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో తక్కువ తీవ్రత గల ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) బాంబు పేలుడు జరిగినట్లు సీఎం సిద్దరామయ్య ధృవీకరంచారు. 

బెంగళూరులోని  ప్రముఖ కేఫ్ లో ఒకటి అయిన రామేశ్వరం కేఫ్ కు కస్టమర్లు పెద్ద ఎత్తున్న వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాంబు పేలింది. హెచ్ ఏఎల్ పోలీస్ స్టేషన్  పరిధిలోని కుండల హళ్లిలోని రామేశ్వరం కేఫ్ లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో కస్టమర్లు భయంతో పరుగులు పెట్టారు.  

ALSO READ :- Viral Video: వామ్మో.. ఇదేం విచిత్రం రా నాయినా... తలపై క్యూఆర్ కోడ్ టాటూ

ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. డాగ్ స్క్వాడ్ , ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనాస్థలంలో తనిఖీలు చేపట్టారు.