Viral Video: వామ్మో.. ఇదేం విచిత్రం రా నాయినా... తలపై క్యూఆర్ కోడ్ టాటూ

Viral Video: వామ్మో.. ఇదేం విచిత్రం రా  నాయినా... తలపై క్యూఆర్ కోడ్ టాటూ

సోషల్ మీడియాలో ఫేమస్ కోసం యూజర్లు వింత వింత వీడియోలు చేస్తుంటారు. పది మందిలో కొత్తగా రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేందుకు నేటితరం యువత ఎంతవరకైనా వెళుతున్నారు. ముఖ్యంగా నలుగురిని నవ్వించేందుకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకొనేందుకు  ఈ వీడియోలో యువకుడు చేసిన పనికి ప్రతి ఒక్కరూ నవ్వుతున్నారు. ఇంతకూ ఆ యువకుడు ఏం చేశాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?  అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. . . .

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలను చూసి జనం తెగ నవ్వుకుంటే.. మరి కొన్ని వీడియోలు జనాలకు కోపాన్ని తెప్పిస్తుంటాయి.. నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి… తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి తన సోషల్ మీడియాకు సంబందించిన క్యూఆర్ కోడ్ ను టాటుగా వేయించుకున్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UNILAD (@unilad)

ఈ వీడియోలో ఒక వ్యక్తి నుదిటిపై క్యూఆర్ కోడ్ టాటూ వేయించుకున్నాడు.వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం.ముఖంపై క్యూఆర్ కోడ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా... QR కోడ్( QR Code ) అనేది స్మార్ట్‌ఫోన్ లేదా కెమెరా ద్వారా స్కాన్ చేయగల బార్‌కోడ్ అనే సంగతి మనందరికీ తెలిసిందే.అయితే దీని ద్వారా మరింత మంది ఫాలోవర్లను సంపాదించాలని వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భావించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వ్యక్తి QR కోడ్ టాటూ( QR Code Tattoo ) అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు లింక్ చేశాడు.తద్వారా మరింతమంది అటెన్షన్, ఫాలోవర్లను ఆకర్షిస్తానని భావిస్తున్నాడు.

ఆ వ్యక్తి టాటూ ఎలా వేయించుకున్నాడో వీడియోలో కనిపించింది.అతను బెడ్‌పై పడుకుని ఉండగా టాటూ ఆర్టిస్ట్‌ అతడి నుదిటిపై సూది, సిరాతో క్యూఆర్ కోడ్‌ను టాటూ కదా వేస్తాడు.మనిషి నొప్పితో ఉన్నట్లు కనిపిస్తున్నాడు, కానీ కదలడు లేదా ఫిర్యాదు చేయడు.టాటూ ఆర్టిస్ట్ QR కోడ్‌ని పూర్తి చేసి, ఆపై దానిని పరీక్షిస్తాడు.అతను తన ఫోన్‌తో మనిషి నుదిటిని స్కాన్ చేస్తాడు. అంతే అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్( Instagram Account ) ఓపెన్ అవుతుంది.

ALSO READ :- కెరీర్ ముగిసినట్టే: పుజారా,రహానేలకు బీసీసీఐ గుడ్ బై

ఈ విచిత్ర వ్యక్తితో పాటు, టాటూ ఆర్టిస్ట్ కెమెరాను చూసి నవ్వుతూ వీడియో ముగిస్తారు.ఈ వీడియో ఫిబ్రవరి 26న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయి  17 లక్షల వ్యూస్‌( వార్త రాసే సమయానికి)  సంపాదించింది. దీనికి 9వేల  పైగా లైక్‌లు, అనేక కామెంట్లు కూడా వచ్చాయి.కొంతమంది పచ్చబొట్టు పొడిపించుకోవడం తెలివైన ఐడియా అని కామెంట్లు చేశారు, మరికొందరు ఇది ఫేక్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఏది ఏమైనా ఈ వీడియో అందర్నీ నోరేళ్లబెట్టేలా చేస్తోంది. . . .