బాలుడిని లైంగికంగా వేధించి,  చంపిన వ్యక్తికి ఉరి శిక్ష

బాలుడిని లైంగికంగా వేధించి,  చంపిన వ్యక్తికి ఉరి శిక్ష
  •   15 రోజుల్లోనే తీర్పు వెలువరించిన యూపీలోని మథుర పోక్సో కోర్టు

మథుర(యూపీ): తొమ్మిదేళ్ల పిల్లాడిని లైంగికంగా వేధించి, ఆపై హత్య చేసిన నిందితుడికి యూపీలోని పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ( ది ప్రొటెక్షన్ ఆఫ్​చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్​ అఫెన్సెస్ యాక్ట్‌‌ (పోక్సో))–2012 ప్రకారం నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పిచ్చారు. కేసు విచారణను రికార్డు సమయంలో.. పదిహేను రోజుల్లో పూర్తిచేసి, నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. మథురలోని పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్​కిశోర్ యాదవ్​ సోమవారం ఈ సంచలన తీర్పు వెలువరించారు.

ఇదీ కేసు..

సదర్​ బజార్​కు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్​ 9న తొమ్మిదేండ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మథురలోని ఔరంగాబాద్​ ఏరియాలోని సీసీటీవీ కెమెరాల ఫు టేజీలను పరిశీలించగా.. మహ్మద్​ సైఫ్ అనే యువకుడితో బాలుడు కనిపించాడు. సైఫ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలుడిని లైంగికంగా వేధించి ఆపై హత్య చేసినట్లు వెల్లడించాడు. మృతదేహాన్ని అర కిలోమీటర్ దూరంలో ఉన్న మురుగు కాల్వలో పడేసినట్లు బయటపెట్టాడు. మిస్సింగ్​ కేసును హత్య, లైంగిక వేధింపుల కేసుగా మార్చారు. విచారించిన జడ్జి తుది తీర్పు వెలువరించారు.