ఓరి దేవుడా : బైక్ (బండి)ని బియ్యపు బస్తాలా మోసుకెళ్లాడు

 ఓరి దేవుడా : బైక్ (బండి)ని బియ్యపు బస్తాలా మోసుకెళ్లాడు

బైక్ పై వెళ్లేటప్పడు ఒక్కోసారి పెట్రోల్ అయిపోవడం సహజంగానే జరిగే సంఘటన.. అప్పుడు బైక్ ను అక్కడే పక్కన పార్క్ చేసి బాటిల్ లో తీసుకొస్తాం... లేకపోతే పెట్రోల్ బంక్ దగ్గరకు నెట్టుకుంటూ వెళ్లి పెట్రోల్ పోయించుకుంటాం.  కాని ఓ యువకుడు బైక్ పై వెళుతుండగా మధ్యలోనే పెట్రోల్ అయిపోయింది.  దాంతో అతడు ఏకంగా.. బైక్ ను ఎత్తి భుజంపై పెట్టుకొని సాదాసీదాగా నడుచుకుంటూ వెళ్లాడు.  బైక్ ను బియ్యం బస్తా ఎత్తినట్లు భుజంపై పెట్టుకొని మరో బాహుబలి అనిపించుకున్నాడు.  ఈ వీడియో  సోషల్ మీడియాలో షేర్  కావడంతో వైరల్ అయింది.  ఈ వీడియోలో కనిపిస్తున్న బైక్ బరువు 300 కిలోలకు పైగా ఉంది. 

బైక్ పై ప్రయాణం చేసినంత సేపు హయిగా ఉంటుంది.  మధ్యలో పెట్రోల్ అయిపోతే అసలు కష్టాలు మొదలవుతాయి. కానీ ఈ వ్యక్తికి ఇది పెద్ద సమస్యగా నిరూపించబడలేదు. ఆ వ్యక్తి చాలా హాయిగా బైక్‌ని భుజం మీద ఎత్తుకుని నడవడం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఆ వ్యక్తి బలాన్ని మెచ్చుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో akshay gujjar అనే వ్యక్తి ఈ వీడియోను అప్‌లోడ్ చేశాడు. అక్షయ్ వృత్తి రీత్యా ఫిట్‌నెస్ మోడల్. బైక్‌ని భుజంపై మాత్రమే ఎత్తాడు. అక్షయ్ ఇన్‌స్టా ఖాతాలో అతని బలాన్ని చూపించే చాలా వీడియోలు షేర్ చేయబడ్డాయి. బైక్‌తో రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. సోషల్ మీడియాలో అక్షయ్‌కి వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.

https://www.instagram.com/reel/CtLYPfgINih/?utm_source=ig_embed&amp%3Butm_campaign=loading