పెరూలో వింత ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల జూలియో సీజర్ బెర్మెజో అనే యువకుడు దాదాపు 800 ఏళ్లనాటి మమ్మీని (శవాన్ని) ఇంట్లో ఉంచుకున్నాడు. దాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానని, ఆరాధిస్తున్నానని చెప్తున్నాడు. గత ముప్పై ఏళ్లుగా ఆ మమ్మీ వాళ్లింట్లోనే ఉందని, దాన్ని ఒక ఐసోథర్మల్ బ్యాగ్‌లో పెట్టి కాపాడుతున్నానని వివరించాడు. ఈ విషయం తెలుకున్న పెరూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆ మమ్మీని స్వాధీనం చేసుకొని, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
బెర్మెజో అతని కుటుంబం తరాలుగా ఫుడ్, సరుకుల రవాణా చేస్తుండేవాళ్లు. 30 ఏళ్ల క్రితం బెర్మెజో తండ్రి జువానిటా అనే మమ్మీని తనతో తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. తన తండ్రి తర్వాత వారసత్వంగా బెర్మెజో ఆ మమ్మీని చూసుకుంటున్నాడు. అయితే, బెర్మెజో ఇప్పుడా మమ్మీని అమ్మకానికి ఉంచి, డీల్ కోసం తన స్నేహితులతో పునో నగరంలోని పార్కుకు తీసుకొచ్చాడు. అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు బెర్మెజోను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మమ్మీ వయసు దాదాపుగా 800 ఏళ్లు ఉంటుందని, 45 సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తిగా పురావస్తు శాఖ గుర్తించింది. వారసత్వాన్ని రక్షించడం కోసం పెరూలో ఉన్న మ్యూజియానికి మమ్మీని తరలించింది.
