జీడిమెట్ల, వెలుగు: రోడ్డుపై దొరికిన గోల్డ్చైన్ను అప్పగించి ఓ వ్యక్తి నిజాయితీ చాటుకున్నాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్వేణుగోపాల స్వామి టెంపుల్ లైన్లో నివాసం ఉండే వెంకటరమణ ఈ నెల 16న రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు.
అతనికి రూ.6 లక్షల విలువైన 5 తులాల గోల్డ్చైన్దొరికింది. దాన్ని వెంటనే పోలీసులకు అప్పగించాడు. వారు గోల్డ్చైన్దొరికినట్లు సోషల్మీడియాలో ప్రచారం చేయడంతో బాధితురాలు గుండా హారిక గురువారం జీడిమెట్ల ఠాణాకు వెళ్లింది. పోలీసులు అమెకు చైన్అందజేసి, నిజాయితీ చాటుకున్న వెంకటరమణను సన్మానించారు.
